Header Banner

భీష్మ ఏకాదశి రోజున అన్నవరం వెళ్తున్నారా? అయితే ఇది గుర్తుంచుకోండి!

  Sat Feb 01, 2025 19:33        Devotional

తెలుగు రాష్ట్రాల్లోనే ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధిలో మాఘమాస భీష్మ ఏకాదశి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో సుబ్బారావు తెలియజేశారు. భీష్మ ఏకాదశి అంటే రత్నగిరి క్షేత్రంలో గల శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి సైతం భక్తులు రత్నగిరి క్షేత్రానికి చేరుకుంటారు. 

 

ఫిబ్రవరి 8న భీష్మ ఏకాదశికి లక్షలాది మంది భక్తులు అన్నవరం వచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా స్వామిని దర్శించుకునే విధంగా శ్రీసత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని సైతం నోచుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో తెలిపారు. ఇందుకు సంబంధించి అన్నవరంలో కార్యనిర్వాహణ అధికారి సుబ్బారావు చైర్మన్ రోహిత్ కుమార్ డివిజన్ డిఎస్పి శ్రీహరిరాజు పర్యవేక్షణలో ఉన్నత అధికారులు అంతా సమీక్ష నిర్వహించారు. 

 

ముఖ్యంగా ఘాట్ రోడ్లో వాహనాల పార్కింగ్, భక్తులకు అందించాల్సిన పాలు, మజ్జిగ అదే విధంగా అన్న ప్రసాదంపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రత్యేకమైన పర్వదినాన్ని ఒక్కసారిగా లక్షల మంది భక్తులు అర్ధరాత్రి నుంచి క్షేత్రానికి వస్తారు కావున వారందరూ క్యూలైన్లకే పరిమితం కాకుండా వేగవంతంగా స్వామివారి దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదం స్వీకరణ తదుపరి వసతి గదులు కేటాయించడం అక్కడ నుంచి వారి స్వగ్రామాలకు వెళ్లడం వంటి విషయాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈ సమీక్షలో తెలిపారు. 

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ముఖ్యంగా ఘాట్ రోడ్ లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా డీఎస్పీ స్థాయి అధికారి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కొండపై స్వామి దర్శనం అనంతరం గోశాల దర్శనం, రామాలయ దర్శనం, వనదుర్గదేవి ఆలయం దర్శనాలకు కావున అనేక రకాల పుష్పాలతో అందంగా అలంకరించనున్నారు. అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి రత్నగిరి కొండల పైకి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని అన్నవరం అధికారులు తెలిపారు. క్షేత్రానికి వచ్చే భక్తులు ఎటువంటి మధ్యవర్తులను నమ్మకుండా అక్కడ ఏర్పాటు చేసిన బోర్డుల ద్వారా పరిశీలించి స్వామి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందాలని అన్నవరం దేవస్థానం పిలుపునిచ్చింది. 

 

అదేవిధంగా స్వామివారికి గత 30 రోజులకుగాను 1కోటి 33 లక్షల 16వేల44 రూపాయలు ఆదాయం సమకూరినట్లుగా దేవస్థానం అధికారులు తెలిపారు. అదేవిధంగా 62 గ్రాములు బంగారం, 525 గ్రాముల వెండి స్వామివారికి సమకూరిందన్నారు. వీటితో పాటు ఇతర దేశాలకు చెందిన డాలర్లు సైతం వచ్చినట్లుగా తెలిపారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

    

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Devotional #Annavaram #BheeshmaEkadasi